మోదీ పాలనలోని కేంద్ర ప్రభుత్వం అతి త్వరలో దేశాన్ని అమ్మకానికి పెట్టేలా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసి రెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మాట్లాడారు. కేవలం ఆరు లక్షల కోట్ల రూపాయల కోసం 400 రైల్వే స్టేషన్లు, 90 రైళ్లు, 265 గూడ్స్ రైళ్లు, 25 విమానాశ్రయాలతో పాటు వివిధ రంగాల్లోని ప్రభుత్వ ఆస్తులను దీర్ఘకాలిక లీజుకు ప్రైవేటు సంస్థల వ్యక్తులకు ఇవ్వాలనుకోవడం శోచనీయమని తులసి రెడ్డి అన్నారు. గడువు తీరిన తరువాత తిరిగి ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
మోదీ వాలకం చూస్తుంటే త్వరలో ప్రధాన మంత్రి పదవిని, కార్యాలయాన్ని లీజుకు ఇచ్చేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలనుకునే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: jagan cbi case: అక్రమాస్తుల కేసులో తన పేరు తొలగించాలని.. సీఎం జగన్ డిశ్చార్జ్ పిటిషన్