వైకాపా నేతలు చేస్తున్న దౌర్జన్యాలపై ప్రజలు తిరగబడాలని తితిదే పాలకమండలి మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పిలుపునిచ్చారు. కడప జిల్లా మైదుకూరులో మాట్లాడిన ఆయన... మైదుకూరులో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక అనంతరం దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకట సుబ్బమ్మ అనే మహిళ బియ్యం అడిగితే... దౌర్జన్యం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందించకుండా కేసులు పెడతామంటూ బాధితురాలిని బెదిరించడాన్ని సుధాకర్ యాదవ్ తప్పుబట్టారు.
తెదేపా హయాంలో మైదుకూరులో అవినీతి జరిగిందని స్థానిక ఎమ్మెల్యే మాట్లాడటం సరికాదని, తెదేపా హయాంలో ఎమ్మెల్యే గా రఘురామిరెడ్డి ఉన్నప్పుడు అవినీతిపై ఎందుకు ప్రశ్నించలేదన్నారు. పేదలకు అండగా కార్యకర్తలకు అండగా ఉంటానని పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదని పుట్టా సుధాకర్ యాదవ్ హెచ్చరించారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడితే చర్యలు తీసుకుంటామన్న అధికారులు.. రాత్రి వేళల్లో అక్రమంగా తరలిస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాజీపేట మండలం నాగసానిపల్లె భూముల ఆక్రమణపై కోర్టులో వేసిన కేసు తొమ్మిదో తేదీ హియరింగ్ జరిగిందని, అధికారులు రికార్డు సమర్పించకపోవడంతో ఈ నెల 27వ తేదీ వాయిదా పడినట్లు పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు.
ఇదీచదవండి.