ETV Bharat / state

రేపట్నుంచి ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు.. సీఎంకు ఆహ్వానం

ONTIMITTA TEMPLE EO: ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి రావాలని ముఖ్యమంత్రి జగన్​ను ఆలయ అధికారులు ఆహ్వానించారు. తితిదే ఈవో, ఒంటిమిట్ట డిప్యూటీ ఈవో.. సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు.

TTD EO AND ONTIMITTA TEMPLE EO  MEET CM JAGAN
సీఎంకు ఆహ్వాన పత్రిక అందించిన తితిదే ఈవో, ఒంటిమిట్ట డిప్యూటీ ఈవో
author img

By

Published : Apr 8, 2022, 7:42 PM IST

ONTIMITTA TEMPLE EO: వైఎస్​ఆర్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరిగే సీతారామ కళ్యాణ మహోత్సవానికి రావాలని సీఎం జగన్​ను ఆలయ అధికారులు ఆహ్వానించారు. తితిదే ఈవో డాక్టర్‌ కేఎస్‌.జవహర్‌ రెడ్డి, ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీ ఈవో డాక్టర్‌ రమణ ప్రసాద్‌ ఆహ్వాన పత్రికను అందించారు. ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి, ప్రసాదాలు అందజేశారు. ఈ నెల 15న రాత్రి 8 గంటలకు ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఒంటిమిట్టలో రేపట్నుంచి 10 రోజులపాటు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కరెంటు కోతలు అందుకే : రఘురామ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.