ఇవీ కూడా చదవండి:వాలంటీర్లను మెరిట్ ప్రాతిపదికగా భర్తీ చేయండి: కొణతాల
వైఎస్సాఆర్ ఘాట్ వద్ద తితిదే ఛైర్మన్ నివాళులు
తితిదే ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి.. కడప జిల్లా చక్రాయపేట మండలం శ్రీగండి క్షేత్రంలోని శ్రీవీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ చేరుకుని నివాళులు అర్పించారు.
ttd-chairman-pays-tributes-at-yssars-tomb
కడప జిల్లా చక్రాయపేట మండలం శ్రీ గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని తితిదే ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి దర్శించుకున్నారు. తితిదే ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు. అనంతరం ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు పొందేందుకు ఘాట్ కు వచ్చానని సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించేలా వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. తిరుమల తిరుపతి ప్రాంగణంలోనూ అవినీతికి తావు లేకుండా చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వైయస్సార్ ఘాట్ ప్రాంగణానికి భారీగా తరలివచ్చారు.
ఇవీ కూడా చదవండి:వాలంటీర్లను మెరిట్ ప్రాతిపదికగా భర్తీ చేయండి: కొణతాల
Intro:ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం లో తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. దీంతో మండలం లోని తోకపల్లి, ప్రగళ్లపాడు, వైడి పాడు గ్రామాల్లో కుంటలు, చెక్ డ్యామ్ లు వాగులు పొంగి పొర్లాయి. ప్రగళ్లపాడు, వైడి పాడు గ్రామాల మధ్య వాగు ఉదృతంగా ప్రవహించడం తో దాదాపు ఐదు గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. చాలా రోజుల తర్వాత హర్షించదగ్గ స్థాయిలో వర్షం కురవడం తో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.Body:భారీ వర్షం.Conclusion:8008019243