కడప జిల్లాలోని మేజర్ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణి చేయాల్సిన ట్రాక్టర్లు దాదాపు ఏడాదిగా కడప కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఎండకు ఎండుతూ వానకు నానుతున్నాయి. 40 శాతం రాయితీతో ఈ వాహనాలను ఎస్సీ వర్గాలకు అందజేయాల్సి ఉంది. లబ్ధిదారుల జాబితా సిద్ధంగా ఉన్నా పంపిణీ మాత్రం జరగలేదు. దీనితో రోడ్డెక్కక ముందే ఈ వాహనాలు తుప్పుపడుతున్నాయి.
ఈ విషయాన్ని 'ఈనాడు' ఎస్సీ కార్పొరేషన్ జిల్లా కార్యనిర్వహణాధికారి వెంకట సుబ్బయ్య దృష్టికి తీసుకెళ్లగా.. ట్రాక్టర్లను సరఫరా చేసిన కంపెనీ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించకపోవటంతో లబ్ధిదారులకు అందజేయలేకపోతున్నామని.. 20 రోజుల్లో పంపిణీ చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి