ETV Bharat / state

పునరావాసం ఉండదు...పరిహారం అందదు..! - kadapa latest news

గండికోట నిర్వాసితులకు దినదినగండంగా మారింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గండికోట జలాశయం నీటిమట్టం అంతకంతకు పెరిగిపోతోంది. అందాల్సిన పరిహారం అందలేదు.. పునరావాసంలో మౌలిక సదుపాయాల కల్పన పూర్తికాలేదు. కాలనీలను గండికోట నీళ్లు చుట్టుముడుతున్నాయి. తప్పని పరిస్థితిలో నిర్వాసితులు ఇల్లు వదిలేసి... తట్టా బుట్ట చేత పట్టుకొని ఖాళీ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గండికోట నిర్వాసితులను పట్టించుకోకుండా పొమ్మనలేక పొగ పెడుతున్నారని పలు పార్టీల నాయకులు మండిపడుతున్నారు.

గండికోట బాధితుల దీనస్థితి
గండికోట బాధితుల దీనస్థితి
author img

By

Published : Sep 20, 2020, 3:50 PM IST

The plight of Gandikota victims
గండికోట బాధితుల దీనస్థితి
గండికోట ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతుండడంతో... కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరులో ఇళ్లలోకి నీరు చేరుతున్నాయి. పరిహారం అందక, పునరావాసం లేక నిర్వాసితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం జలాశయంలో 13 టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉండటంతో... పలు కాలనీల్లో నీళ్లు చేరుతున్నాయి. బీసీ, ఎస్సీ కాలనీలో ఉన్న ప్రజలు ప్రాణభీతితో తప్పని పరిస్థితుల్లో ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికి సుమారు వందకు పైగా కుటుంబాలు ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. పునరావాసంతోపాటు పరిహారం పెంచాలని 18 రోజులుగా తాళ్ల పొద్దుటూరు వాసులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా ఎలాంటి ఫలితం లేదని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీఎం సొంత జిల్లాలో ఇంత ఘోరమా..

తాళ్ల పొద్దుటూరు గ్రామంలో మొత్తం 2వేల 869 కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 1,104 మంది పునరావాసం కావాలని.... 1,765 మంది ఒకేసారి డబ్బులు చెల్లించాలని కోరుకున్నారు. వీరిలో కొంతమందికి మాత్రమే పరిహారం చెల్లించారు. 23 టీఎంసీల నీటి నిల్వ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్​రెడ్డి ఆదేశించడంతో నిర్వాసితులు మరింత ఆందోళన చెందుతున్నారు. గండికోటకు అనుసంధానంగా ఉన్న అన్ని జలాశయాలు నిండుగా ఉన్నాయని....ఇలాంటి తరుణంలో 23 టీఎంసీల నీరు నిల్వ ఉంచడం అవసరం ఏంటని పలు పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే గండికోట నిర్వాసితులు ఆందోళన బాట పట్టడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వారికి న్యాయం చేకూరాలని ఆ పార్టీ నాయకులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: నిర్వాసితుల పోరాటానికి తెదేపా, భాజపా నేతల మద్దతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.