కడపజిల్లా లో కరోనా రోగుల పట్ల అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారు. శ్రీనివాస్ ఇంజినీరింగ్ కళాశాల కోవిడ్ కేంద్రంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఉదయం మరణించాడు. కానీ రాత్రి వరకూ ఆ మృతదేహాన్ని ఎవరు తీయక పోవడంతో మిగిలిన వారు ఆందోళనకు గురయ్యారు. కొందరు బాత్రూం, వేరే బ్లాకులలో తలదాచుకున్నారు. రాత్రి బ్లాకులోకి వచ్చిన సిబ్బందితో వారు వాగ్వాదానికి దిగగా.. కొంతసేపటికి వారు ఆ మృతదేహాని తీసుకెళ్లారు.
ఇదీ చూడండి. ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం.. కళ్లముందే ప్రాణాలు పోయాయి.