కడప జిల్లాలోని మూడు మండలాల్లో సుమారు 600 ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహా రెడ్డి ఆరోపిచారు. కమలాపురం, వీరపునాయుని పల్లి యర్రగుంట్ల మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా సాగులో ఉన్న ప్రభుత్వ భూములను.. రైతులు, నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ భూముల్లో ఇనుప కంచెలు వేసి పంట సాగు చేస్తుంటే అధికారులు నిద్ర పోతున్నారా అని ప్రశ్నించారు.
ప్రభుత్వ భూముల్లో బోర్లు వేసి, విద్యుత్ సరఫరా తీసుకొని పంటలు సాగు చేస్తుంటే.. జిల్లా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వ భూముల ఆక్రమణ పెరిగిపోయిందని విమర్శిచారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, అవసరమైతే కోర్టుకు వెళ్లైనా సరే పేదలకు ప్రభుత్వ భూమి అందేటట్లు చేస్తామన్నారు.
ఇవీ చూడండి: