కడపజిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ను పరిశీలించి తిరిగి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీపీపీ ప్రస్తుత పరిస్థితుల పై సీఈ సుబ్రమణ్యంతో తెదేపా నాయకులు చర్చించారు.
ప్రస్తుత జగన్ సర్కార్ ఆర్టీపీపీని నిర్వీర్యం చేస్తోందని, కేంద్రానికి అప్పగించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల బదిలీలను ఆపాలని సీఈ సుబ్రమణ్యంను కోరారు.
211 కోట్లు విలువ చేసే 4.68 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును వృథాగా నిల్వచేశారని విమర్శించారు. ఉద్యోగులను బదిలీ చేయటం అన్యాయమని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఈని కోరారు.
ఇదీ చూడండి