కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం నేత నందం సుబ్బయ్యను దారుణంగా హత్య చేశారు. సోములవారిపల్లె పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఇళ్ల స్థలాల ప్లాట్లలో.. సుబ్బయ్యను కిరాతకంగా నరికి చంపారు. తలపై నరకడంతో సుబ్బయ్య తల ఛిద్రమైంది. హత్య గురించి తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హంతకులు ఎవరనే విషయంపై దర్యాప్తు మొదలుపెట్టారు.
కడప జిల్లా తెలుగుదేశం అధికార ప్రతినిధిగా వ్యవహరించిన సుబ్బయ్య.. రాజకీయ విమర్శలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ఆ తర్వాత ఎదుటి పార్టీకి చెందినవారు కూడా ప్రతి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో హత్య జరగడం కలకలం రేపుతోంది.
ఇదీ చదవండి: 'తాడిపత్రి ఘటన.. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు సాక్ష్యం'