ETV Bharat / state

'గురుప్రతాప్‌రెడ్డి హత్య.. నిగ్గు తేల్చాలి' - TDP Fact Find Team news

ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో గండికోట జలాశయం ముంపు బాధితులకు పరిహారం పంపిణీలో అక్రమాల ఆరోపణలపై... సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. కడప జిల్లా పి.అనంతపురంలో పర్యటించిన ఆ పార్టీ నిజనిర్ధరణ కమిటీ... గ్రామస్థులను అడిగి పరిహారమందిన తీరును తెలుసుకుంది. అవినీతిని ప్రశ్నిస్తే హత్య చేస్తున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు.

TDP Fact Find Team Visit Kadapa District
'గురుప్రతాప్‌రెడ్డి హత్య.. నిగ్గు తేల్చాలి'
author img

By

Published : Dec 19, 2020, 4:46 AM IST

'గురుప్రతాప్‌రెడ్డి హత్య.. నిగ్గు తేల్చాలి'

కడప జిల్లా కొండాపురం మండలం పి.అనంతపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నిజనిర్ధరణ కమిటీ పర్యటించింది. మాజీమంత్రులు సోమిరెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి, కేఈ ప్రభాకర్ తదితరులు గ్రామానికి చేరుకుని.... ఇటీవల గురుప్రతాప్‌రెడ్డి హత్యకు గురైన ప్రదేశాన్ని, గ్రామసభ నిర్వహించిన ప్రాంతాన్ని పరిశీలించారు. గ్రామస్థులు, మహిళలతో మాట్లాడారు. గండికోట పరిహారం పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని ఎర్రగుడి, తాళ్ల ప్రొద్దుటూరు బాధితులు నేతల ఎదుట వాపోయారు. చెక్కుల మంజూరుకు అధికారులు డబ్బులు అడుగుతున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే... హత్య చేసే స్థాయికి వైకాపా నేతలు ఎదిగారని మాజీమంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు. తమ హయాంలో బాధితులకు పరిహారం పంపిణీలో ఆరోపణలు వస్తేనే ఆర్డీవోపై వేటు వేశామని, ప్రస్తుతం అవినీతికి పాల్పడుతున్నవారికి అండదండలు అందుతున్నాయని ఆరోపించారు. గురుప్రతాప్‌రెడ్డి హత్యతో.. ప్రశ్నిస్తే చంపేస్తామనే సంకేతాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన కుటుంబాన్ని తమ పార్టీ నేతలు కలవకుండా చేయడంలో ఆంతర్యేమంటని అమర్‌నాథ్‌రెడ్డి ప్రశ్నించారు.

కమిటీ పర్యటన సమయంలో గ్రామంలో చాలా ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. హత్యకు గురైన గురుప్రతాప్‌రెడ్డి కుటుంబసభ్యులు సహా చాలామంది శుక్రవారం ఉదయమే ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. వైకాపా నేతలే బలవంతంగా ఖాళీ చేయించారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు.

ఇదీ చదవండీ... నష్టపోయిన రైతులకు పెట్టుబడి కింద రాయితీ చెల్లింపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.