అమీర్ బాబు ఎన్నికల ప్రచారం చంద్రబాబు అమలు చేస్తున్నసంక్షేమ పథకాలే మళ్లీ ఆయన్ను ముఖ్యమంత్రినిచేస్తాయని కడప తెదేపా అసెంబ్లీ అభ్యర్థి అమీర్ బాబు చెప్పారు. ఎన్నికలకు సమయం దగ్గర పడినందునఆయా పార్టీల నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కడపలో తెదేపా శ్రేణులు ఇంటింటికీవెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు వేయాలని అభ్యర్థించారు. మరో ఐదేళ్ళ పాటు చంద్రబాబు అధికారంలోకి ఉంటేరాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో నిలబెడతారని భరోసా కల్పించారు. ఈనెల 11న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకేఓటు వేయాలని కోరారు.
ఇవీ చదవండి.
సైకిల్‌కు ఓటు వేయండి.. అభివృద్ధి పొందండి!