కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు.. ఇదే విషయంపై పోలీసులు పిలిచి మందలించడం వల్ల మనస్తాపం చెంది కడప జిల్లా ఎర్రగుంట్ల పట్టణానికి చెందిన వారధి ప్రభాకర్ (45) ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మండల పరిధి మాలెపాడు గ్రామానికి చెందిన వారధి ప్రభాకర్, దానమ్మ దంపతులు జీవనోపాధి నిమిత్తం ఎర్రగుంట్ల పట్టణం శాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. కుమార్తె జూన్ 25వ తేదీన పట్టణానికి చెందిన ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ సందర్భంగా తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడారు. తమకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నవారు అవసరం లేదని ఇరు కుటుంబాల వారు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. ఈ సందర్భంగా ప్రభాకర్ స్టేషన్ ముందున్న రక్షకులను నిందించారు. దీంతో ప్రభాకర్‌ను మందలించి అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుమార్తె ప్రేమ పెళ్లి, పోలీసులు మందలిండం వల్ల మనస్తాపం చెందిన ప్రభాకర్ శుక్రవారం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య దానమ్మ పేర్కొన్నారు. పెద్ద కుమారుడు కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై సీఐ సదాశివయ్య వివరణ కోరగా కుమార్తె ప్రేమ పెళ్లి చేసుకుందని ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నారని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ఇదీ చదవండి :