Strike in Railway Koduru: అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలంటూ రైల్వేకోడూరులో రెండోరోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అన్ని విధాలుగా అనువైన రాజంపేటను వదిలి.. రాయచోటిని జిల్లా కేంద్రం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళ్లపాక అన్నమయ్య నడియాడిన ప్రాంతాన్ని వదిలి వేరేచోట జిల్లా కేంద్రం ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయలంటూ డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తామని వారు తెలిపారు.
తాళ్లపాక అన్నమయ్య రాజంపేట నుండి రైల్వేకోడూరు మీదుగా తిరుమలకు పాదయాత్రగా ఎన్నోసార్లు వెళ్లారని అన్నారు. అన్నమయ్య నడియాడిన ప్రాంతానికి కాకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా నిర్ణయించడం మంచిది కాదని తెలిపారు. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం వీలుకాకుంటే... తక్షణమే రైల్వేకోడూరును తిరుపతి బాలాజీలో కలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా, తెదేపా, సీపీఐ. సీపీఎం విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
పాలనా వికేంద్రీకరణ కోసం జిల్లాల సంఖ్యను పెంచడం అన్నిపార్టీలు హర్షించదగ్గ విషయమే. కానీ అధికారపార్టీ నాయకులు వారి ఆస్తులు పెంచుకునేందుకు వారికి అనువైన ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా మార్చారు. ఇది అంత మంచి నిర్ణయం కాదు. తాళ్లపాక అన్నమయ్య నడియాడిన ప్రాంతాన్ని వదిలి వేరేచోట జిల్లా కేంద్రం ఎలా ఏర్పాటు చేస్తారని నేను ప్రశ్నిస్తున్నాను. తాళ్లపాక అన్నమయ్య రాజంపేట నుండి రైల్వేకోడూరు మీదుగా తిరుమలకు పాదయాత్రగా ఎన్నోసార్లు వెళ్లారు. -విశ్వనాథ నాయుడు, తెదేపా నేత
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: 'టీకా తీసుకుంటే నా 8 మంది పిల్లలేంగాను?'.. వీడియో వైరల్