కడప జిల్లా రాజంపేట పట్టణంలోని మన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి వీజీ వెంకట్ రెడ్డి తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథక నిర్వహణ తీరును విద్యార్థులను అడిగి ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి వరుసలో నిలబడి భోజనం పెట్టించుకుని తిన్నారు. స్థానికంగా ఉండే భవిత కేంద్రాన్ని పరిశీలించిన ఆయన ఆంగ్ల మాధ్యమంపై జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణపై పలు సూచనలు ఇచ్చారు. విద్యారంగంలో సమూల మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంలో చిక్కి కోసం రూ.160 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. 'నాడు-నేడు' కార్యక్రమానికి సంబంధించి పాఠశాలల్లో మౌలిక వసతుల సదుపాయం కోసం రూ.300 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు.
విద్యారంగంలో సమూల మార్పులపై ప్రత్యేక దృష్టి - State Education Special Secretary visit mannor zp high school
విద్యారంగంలో సమూల మార్పులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి వీజీ వెంకట్ రెడ్డి తెలిపారు. రాజంపేట పట్టణంలోని మన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించిన ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

కడప జిల్లా రాజంపేట పట్టణంలోని మన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి వీజీ వెంకట్ రెడ్డి తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథక నిర్వహణ తీరును విద్యార్థులను అడిగి ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి వరుసలో నిలబడి భోజనం పెట్టించుకుని తిన్నారు. స్థానికంగా ఉండే భవిత కేంద్రాన్ని పరిశీలించిన ఆయన ఆంగ్ల మాధ్యమంపై జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణపై పలు సూచనలు ఇచ్చారు. విద్యారంగంలో సమూల మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంలో చిక్కి కోసం రూ.160 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. 'నాడు-నేడు' కార్యక్రమానికి సంబంధించి పాఠశాలల్లో మౌలిక వసతుల సదుపాయం కోసం రూ.300 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు.
ఇదీ చూడండి: నాసిరకం మధ్యాహ్న భోజనం కథనంపై ఎమ్ఈవో విచారణ