మహిళా సమస్యలపై మహిళా పోలీస్ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళా పోలీస్ కార్యదర్శులుగా ఎంపికైన 26 మందికి జిల్లా పోలీస్ కార్యాలయంలో నియామక పత్రాలను అందజేశారు. మహిళా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా మహిళా పోలీస్ కార్యదర్శులు ముందు ఉండాలని సూచించారు. మహిళలకు సంబంధించిన సమస్యలన్నింటిపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ర్యాగింగ్, వరకట్న వేధింపులు, తదితర సమస్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు.
ఇవీ చూండండి...