కడప జిల్లా(kadapa district) బద్వేలు ఉప ఎన్నిక(Badvel bypoll)కు కేంద్ర పారా మిలటరీ దళాలను కేటాయించడాన్ని వైకాపా నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu Veerraju) విమర్శించారు. ముఖ్యంగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి(govt chief whip Srikanth Reddy).. తట్టుకోలేక భాజపాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఆయన కడపలో మండిపడ్డారు. రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి కనుసన్నల్లో ఇసుక దందా యథేచ్చగా సాగుతోందని.. కొన్ని ఫొటోలను మీడియాకు చూపించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమ, దుగరాజపట్నం పోర్టు ఇస్తే బద్వేలు పోటీ నుంచి తప్పుకుంటామని శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసరడంపై సోము వీర్రాజు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో.. రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు అభివృద్ధి చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమా అని శ్రీకాంత్ రెడ్డికి (Somu Veerraju challenge to srikanth reddy)సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రత్యేకమైన శ్రద్ధ ఉందని.. విభజన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తున్నారని సోము వీర్రాజు తెలిపారు. బద్వేలు నియోజక వర్గంలో వైకాపా నేతల భూ అక్రమణలతో ప్రజలు విసిగిపోయారని.. బాధితులకు భాజపా అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి