మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కడపలోని శివాలయాలు.. శివనామ స్మరణతో హోరెత్తుతున్నాయి. కడపలో ప్రసిద్ధిగాంచిన మృత్యుంజయ కుంట శివాలయం, నవీకోట శివాలయం, మోచంపేట్ శివాలయం, దేవుని కడప శివాలయాల్లో.. తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
కిక్కిరిసిన ఆర్టీసీ బస్ స్టాండ్
జిల్లాలోని శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తులతో.. కడప ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పొలతల పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు.. దాదాపు 150 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో... వారి కోసం ప్రత్యక సర్వీసులు నడుపుతున్నట్లు వివరించారు. జిల్లాలో నిత్య పూజ కోన, కన్యతీర్థం, అల్లాడుపల్లె దేవాలయాలు, జ్యోతి, అత్తిరాల, బ్రహ్మంగారిమఠంతో పాటు దాదాపు 15 పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: