కడప జిల్లా జమ్మలమడుగు నగర పంచాయతీలోని ఏడు, ఎనిమిది వార్డుల్లో సచివాలయ ఉద్యోగులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. సచివాలయం అడ్మిన్ ఉద్యోగి జోసెఫ్ మనోహర్ కార్యాలయంలో ఉండగా జమ్మలమడుగు పట్టణ ఎస్సై రవికుమార్ లోనికి వెళ్ళాడు. ఆ ఉద్యోగి ముఖానికి టవలు చుట్టుకొని ఉండగా... దాన్ని తీయాలని ఆదేశించాడు. అందుకు అడ్మిన్ అధికారి కరోనా నేపథ్యంలో ముఖానికి ముసుగు తీయడానికి నిరాకరించాడు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎస్సై... సచివాలయ ఉద్యోగి కాలర్ పట్టుకున్నాడు. ఈ చర్యను నిరసిస్తూ వాలంటీర్లు, ఉద్యోగులు ఆందోళనకు దిగారు. స్థానికి ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :