ETV Bharat / state

ఒంటిమిట్టలో ఘనంగా సీతారాముల కల్యాణం - సీతారాముల కల్యాణ మహోత్సవం వార్తలు

రెండో భద్రాద్రిగా పిలవబడే కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణం కనులపండువగా జరిగింది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా సీతారాముల కల్యాణమహోత్సవం ఏకాంతంగా సాగింది. స్వామివారి కల్యాణానికి ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరై పట్టువస్త్రాలు అందజేశారు.

seetharamula kalyanam
ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం
author img

By

Published : Apr 26, 2021, 8:36 PM IST

Updated : Apr 27, 2021, 12:39 AM IST

ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం

శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా..కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రాముని ఆలయంలో సోమవారం రాత్రి 8 గంటల నుంచి... 10 గంటల వరకు సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. కోవిడ్ దృష్ట్యా భక్తులకు అనుమతి లేకపోగా..తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు, ఉద్యోగులు....... ఏకాంతంగా రాములవారి కల్యాణం నిర్వహించారు. తిరుమల నుంచి వచ్చిన వేద పండితులు........ రాజేశ్ ఆద్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కల్యాణం జరిగింది. కోవిడ్ ప్రభావంతో రెండో ఏడాది కూడా ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణాన్ని పండితులు ఏకాంతంగానే నిర్వహించారు.

సీతారాముల కల్యాణ మహోత్సవానికి......... ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ హాజరయ్యారు. స్వామివారికి మంత్రి పట్టు వస్త్రాలు,....... ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణ క్రతువుకు ముందుగా....... ఆలయంలో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు.బంగారు ఆభరణాలు, పట్టువస్త్రాలతో సీతారాములను అందంగా అలంకరించారు. పలు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పుష్పాలతో......... కల్యాణ వేదికను తీర్చిదిద్దారు. ఆలయం విద్యుత్ దీపాలంకరణతో వెలిగిపోయింది. సుమారు రెండు గంటల పాటు స్వామివారి కల్యాణ క్రతువు సాగింది.

రాష్ట్రం ప్రభుత్వం తరపున సమర్పించిన... పట్టువస్త్రాలను స్వామివారి ఉత్సవ విగ్రహాలపై ఉంచారు. వేద మంత్రోచ్ఛారణలు,... మంగలవాయిద్యాల నడుమ స్వామివారికి జీలకర్ర-బెల్లం పెట్టే క్రతువు నిర్వహించారు. అనంతరం......... కోదండ రాముడు సీతమ్మ మెడలో మాంగల్యధారణ చేసే కార్యక్రమాన్ని... వేదపండితులు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం రథోత్సవం నిర్వహిస్తారు.

ఇదీ చదవండి: రేపు తిరుమలలో పౌర్ణమి గరుడవాహన సేవ

Last Updated : Apr 27, 2021, 12:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.