ETV Bharat / state

ఊరూ - వాడ అంబరాన్నంటిన సంక్రాంతి సంబరం - రంగవల్లుల పోటీలు

రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల్లో మహిళలకు ముగ్గుల పోటీలు, యువతకు ఆటల పోటీలు నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా పలు చోట్ల కార్యక్రమాలు జరిగాయి.

sankrathi celebrations in all over state
రాష్ట్రంలో జరిగిన సంక్రాంతి సంబరాలు
author img

By

Published : Jan 12, 2020, 8:57 PM IST

రాష్ట్రంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహిస్తున్నారు. కడప జిల్లా బద్వేల్​లో కళాపీఠం ఆధ్వర్యంలో మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా నూజివీడులో యువతకు ఆహ్లదకరంగా... ఉండే వాలీబాల్ పోటీలు నిర్వహించారు. యువతను జాదం వంటి ఆటల నుంచి దూరంగా ఉంచేందుకు ఈ క్రీడలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. విజయవాడ పాయికాపురంలోని ప్రైవేట్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని పండుగ విశేషాలను తెలిపే ప్రదర్శనలను తిలకించారు.

అలరించిన సంస్కృతిక కార్యక్రమాలు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. చిన్నపిల్లల డ్యాన్సులు, హరిదాసుల కీర్తనలు ఎంతగానో అలరించాయి. కడప జిల్లా రాజంపేటలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. కర్నూలు జిల్లాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఉల్లాసంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా గుమ్మనూరు జయరాం, ఎంపీ సంజీవ్ కుమార్ హాజరయ్యారు. కబడ్డీ , ఎడ్ల బండ లాగుడు పోటీలు, రంగవల్లులు, క్రికెట్ పోటీలను నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం జానంపేటలో బొప్పన ఛారిటబుల్ ట్రస్ట్​ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన బొప్పన కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కథలు అలరించాయి.

ఇదీ చూడండి:

అదిరిపోయే లుక్‌తో మాస్‌ మహారాజా

Intro:6666

Body:888

Conclusion:కడప జిల్లా బద్వేలులో నీ బాలుర ఉన్నత పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు బద్దెన కళాపీఠం ఆధ్వర్యంలో కొనసాగాయి. రకరకాల ముగ్గులు వేసి మహిళలు రంగులు అద్దారు. రంగవల్లుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.