కడప జిల్లా రాయచోటి రింగ్ రోడ్డు వద్ద ఐషర్ వాహనం-కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా... అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా తల్లి లక్ష్మి, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి మృతి చెందారు. సందీప్ రెడ్డి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మృతులు బెంగళూరు నుంచి నెల్లూరుకి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల వివరాలను సమీప బంధువులకు తెలియజేశారు. మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రాజు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి... మరొకరి పరిస్థితి విషమం
కడప జిల్లా రాయచోటి రింగ్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఐషర్ వాహనం-కారు ఢీకొని తల్లీ, కుమారుడు మృతిచెందగా... మరొకరిని ఆసుపత్రికి తరలించారు.
కడప జిల్లా రాయచోటి రింగ్ రోడ్డు వద్ద ఐషర్ వాహనం-కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా... అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా తల్లి లక్ష్మి, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి మృతి చెందారు. సందీప్ రెడ్డి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మృతులు బెంగళూరు నుంచి నెల్లూరుకి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల వివరాలను సమీప బంధువులకు తెలియజేశారు. మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రాజు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతి