విశ్రాంత ఉద్యోగులకు కనీస పింఛన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని కడప జిల్లా పెన్షనర్స్ అండ్ రిటైర్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. కడప పీఎఫ్ కార్యాలయం ఎదుట రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉన్నత పింఛన్ వర్తింపజేయాలని కోరారు. ఈఎస్ఐ ద్వారా ఉచిత వైద్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. గత ఐదేళ్ల నుంచి ఎన్ని పోరాటాలు, ఆందోళనలు చేసినప్పటికీ ఎన్డీఏ సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఇదీ చదవండి