లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప యోగివేమన విశ్వవిద్యాలయం పీజీ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కృష్ణారెడ్డిని బాధ్యతల నుంచి తప్పించారు. ఈమేరకు ఉప కులపతి సూర్య కళావతి ఆదేశాలు జారీ చేశారు. పీజీ కళాశాలలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని పట్ల ప్రిన్సిపల్ ఆచార్య కృష్ణారెడ్డి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు... ఆమె సెల్ ఫోన్ కు సందేశాలు పంపినట్లు బాధితురాలు వీసీకి ఫిర్యాదు చేశారు.
ఆదివారం కూడా విధులకు రావాలని వేధించడం.. ఆపై లైంగికంగా ఇబ్బంది పెట్టాడని బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం సోమవారం వెలుగుచూడటంతో ప్రజాసంఘాలు, వామపక్షాలు, విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. పరిస్థితిని గమనించిన వీసీ సూర్యకళావతి వెంటనే కృష్ణారెడ్డిని ప్రిన్సిపల్ బాధ్యతల నుంచి ఇవాళ తప్పించారు. ఆయన స్థానంలో ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ గా చంద్రమతిని నియమిస్తూ ఉపకులపతి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 1,540 కరోనా కేసులు, 19 మరణాలు