కడప జిల్లా పుల్లంపేట మండలంలో ఉదయం టాస్క్ఫోర్స్ పోలీసులు భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ. రెండు కోట్ల యాభై లక్షలపైగా ఉంటుందని తెలిపారు. సమాచారం మేరకు పుల్లంపేట మండలం బోటుమీద పల్లి గ్రామం, అన్నసముద్రం సమీపంలోని రాజా కాలువలో గాలింపు చర్యలు చేపట్టామని స్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పెద్ద ఎత్తున ఎర్రచందనం నిల్వ గుర్తించామన్నారు. వాటిని రైల్వేకోడూరు టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తరలించినట్లు వివరించారు.
ఈ కేసులో నిందితుల కోసం నాలుగు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నామని టాస్క్ఫోర్స్ ఎస్. పి ఆంజనేయులు వివరించారు. రావి చెరువులో పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలను గుర్తించిన ఆర్. ఐ కృపానంద, ఆర్.ఎస్.ఐ లక్ష్మయ్య వచ్చిన సమాచారం మేరకు ఈ దాడి చేసినట్లు తెలిపారు. ఎర్ర చందనం దుంగలు దాచిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఏస్పీ ఆంజనేయులుతో పాటు డీఎస్పీ వెంకటయ్య, టాస్క్ఫోర్స్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి