ETV Bharat / state

రాయచోటిలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ - కడప జిల్లాలో రంజాన్ తోఫా పంపిణీ

కడప జిల్లా రాయచోటిలో పేద ముస్లింలకు తెదేపా జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్ రెడ్డి రంజాన్ తోఫా పంపిణీ చేశారు. వైకాపా ప్రభుత్వం ముస్లింల కోసం రంజాన్ నిధులు విడుదల చేయకపోగా... కనీసం రంజాన్ తోఫా కూడా ఇవ్వని స్థితిలో ఉందంటే సిగ్గుచేటని విమర్శించారు.

ramzan toofa distributed to poor muslims in rayachoti of kadapa district
రాయచోటిలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ
author img

By

Published : May 23, 2020, 9:57 PM IST

కడప జిల్లా రాయచోటి పట్టణంలో పేద ముస్లిం ప్రజలకు... తెదేపా జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాస్ రెడ్డి రంజాన్ తోఫా పంపిణీ చేశారు. తెదేపా హయాంలో పేదలకు రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుకలు పంచేవారని తెలిపారు.

ప్రతి పేదవాడు సంతోషంగా పండుగ జరుపుకోవాలని మాజీముఖ్యమంత్రి చంద్రబాబు కానుకలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం ముస్లింల కోసం రంజాన్ నిధులు విడుదల చేయకపోగా... కనీసం రంజాన్ తోఫా కూడా ఇవ్వని స్థితిలో ఉందని ఆరోపించారు. ఇమాం, మౌజాన్​లకు పెండింగ్​లో ఉన్న వేతనాలను పూర్తిగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణలో రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:

'తినటానికి తిండి లేదు... అద్దె కట్టేందుకు డబ్బు లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.