కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. దిల్లీలో మాదిరిగానే రాష్ట్రంలోనూ కరోనా ఆర్థిక సహాయం కింద రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రూ.1000 ఆర్థిక సహాయం చేయడం హాస్యాస్పదమన్నారు. కేంద్రం ఇచ్చిన సహాయాన్ని వైకాపా ఇచ్చినట్లు ప్రచారం చేస్తోందని విమర్శించారు. మూడు రోజుల్లో కరోనా ఆర్థిక సహాయం పెంచకపోతే మళ్లీ 48 గంటలు దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి: