ETV Bharat / state

రాజంపేటలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల ధర్నా - కడప రాజంపేట విద్యుత్​ కార్యాలయం వద్ద ప్రైవేటు కార్మికుల నిరసన

రాజంపేట విద్యుత్​ సబ్​ డివిజన్​ కార్యాలయం వద్ద, కాంట్రాక్టు కార్మికులు నిరసనకు దిగారు. ఒడిశాలో వరదలు వచ్చిన సమయంలో తమ సేవలను ఉపయోగించుకున్న, విద్యుత్ అధికార్లు..వాటికి సంబంధించి ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వలేదని వారు ఆరోపించారు.

డబ్బులు రాలేదంటూ ప్రైవేటు విద్యుత్​ కార్మికుల నిరసన
author img

By

Published : Sep 17, 2019, 7:24 PM IST

డబ్బులు రాలేదంటూ ప్రైవేటు విద్యుత్​ కార్మికుల నిరసన

బకాయిలు చెల్లించాలని కడప జిల్లా రాజంపేట విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ముందు కాంట్రాక్టు ఉద్యోగులు నిరసనకు దిగారు. ఈ ఏడాది మే నెలలో ఒడిశాలో వచ్చిన వరదల సమయంలో తమ సేవలను ఉపయోగించుకుని..వాటికి సంబంధించి ఇప్పటి వరకు చెల్లింపులు చేయలేదని కార్మికులు ఆరోపించారు. కార్మికులకు రావాల్సిన రూ.10 లక్షల బిల్లుల ప్రతిపాధనలను ఉన్నతాధికారులకు పంపామని, వారు ఆమోదం తెలిపిన వెంటనే చెల్లింపులు చేస్తామని ఏడీఈ తెలిపారు.

ఇదీ చూడండి : ఉద్ధృతంగా కుందు...ఆందోళనలో గ్రామస్థులు

Intro:Ap_cdp_49_17_varadallo_kastapaddam_dabbulivvaraa_Av_Ap10043
k.veerachari, 9948047582
వరదల్లో కష్టపడి పనిచేశాం.. గాయపడ్డాం.. కానీ మా కష్టానికి తగిన ఫలితం దక్కలేదని ప్రవేటు విద్యుత్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా రాజంపేట విద్యుత్ సబ్ డివిజన్ నుంచి సుమారు 50 మంది ప్రైవేటు విద్యుత్ కార్మికులు ఈ ఏడాది మే నెలలో ఒరిస్సాలో వరదలు వచ్చిన సమయంలో అక్కడ సేవలందించేందుకు వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడ పని చేసినందుకు డబ్బులు రాకపోవడంతో ప్రైవేట్ విద్యుత్ కార్మికులు రాజంపేట విద్య డివిజన్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ మేరకు స్థానిక విద్యుత్ డివిజన్ కార్యాలయం చేరుకున్న కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ విద్యుత్ ఏడిఈ సుబ్రహ్మణ్యం కు మొరపెట్టుకున్నారు. వరదల్లో ఎన్నో ఇబ్బందులు పడి విద్యుత్ పనులను చేశామని, అక్కడి ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదన్నారు. మీరు కూడా ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విద్యుత్ ఏడీఈ సుబ్రహ్మణ్యం స్పందిస్తూ ఒరిస్సా వరద పనులకు వెళ్లిన కార్మికులకు చెల్లించాల్సిన డబ్బుకు సంబంధించి 10 లక్షలతో ప్రతిపాదన చేశామని, ఉన్నతాధికారులు ఆమోదించిన వెంటనే కార్మికులకు అందజేస్తామని తెలిపారు.

Body:ఒరిస్సా వరదల్లో పని చేయించుకుని డబ్బులు ఇవ్వరా

Conclusion:కడప జిల్లా రాజంపేట

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.