ETV Bharat / state

ప్రాణం నిలిపిన పోలీసులు! - జమ్మలమడుగులో వ్యక్తిని కాపాడిన పోలీసులు

ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు సకాలంలో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కడప జిల్లా జమ్మలమడుగు పాత బస్టాండ్​లో గూడెంచెరువులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

police resuced a man at jammalamadugu
జమ్మలమడుగులో వ్యక్తిని కాపాడిన పోలీసులు
author img

By

Published : Aug 11, 2020, 8:25 AM IST

కడప జిల్లా జమ్మలమడుగు పాత బస్టాండ్​లో గూడెంచెరువు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ వ్యక్తిని స్థానికులు చూసినప్పటికీ ఆసుపత్రికి తరలించేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఈ విషయం కానిస్టేబుళ్లకు తెలిసింది. వెంటనే ఒక ఆటోలో ఆ వ్యక్తిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో బాధితుడు సురేష్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు దంపతుల మధ్య ఘర్షణ కారణమని పోలీసులు తెలిపారు. గూడెం చెరువుకు చెందిన సురేష్ దంపతులు తరచూ గొడవ పడేవారని.. సోమవారం భార్య ...భర్త పై ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్​కు వెళ్లిందని అన్నారు. కేసు పెడుతుందోమోనని భయపడిని భర్త ..నెయిల్ పాలిష్ ద్రావణాన్ని తాగి ఆత్మహత్యకు యత్నించాడని వారు పేర్కొన్నారు. సకాలంలో స్పందించి బాధితుడిని కాపాడిన పోలీసులను పలువురు ప్రశంసించారు.

ఇదీ చూడండి. ఆసుపత్రిలో చేరిన వృద్ధుడు అదృశ్యం... చివరికి పోర్టు రూంలో..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.