ETV Bharat / state

నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై క్రిమినల్​ కేసులు - కడప తాజా వార్తలు

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన కడపలో ప్రైవేటు కొవిడ్ వైద్యశాలలపై పోలీసులు క్రిమినల్​ కేసులు నమోదు చేశారు. రోగుల నుంచి అధిక మెుత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు.

Kadapa CI Satyanarayana
కడప సీఐ సత్యనారాయణ
author img

By

Published : Apr 29, 2021, 12:42 PM IST

కడప సీఐ సత్యనారాయణ

కడపలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన కొమ్మ సూపర్ స్పెషాలిటీ, కేసీహెచ్ సూపర్ స్పెషాలిటీ ప్రైవేటు కొవిడ్​ ఆసుపత్రులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కొంత మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చిన బాధితుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో.. కడప విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఆరోపణలు రుజువు కావడంతో విజిలెన్స్ అధికారులు నివేదికను పోలీసులకు అందజేశారు. ఈ మేరకు రెండు ఆసుపత్రుల పై క్రిమినల్ కేసులు నమోదు చేశామని ఒకటో పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండీ.. 'కడప జిల్లాలో రెమ్​డెసివర్ కొరత లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.