కడప జిల్లా ముద్దనూరులోని ప్రభుత్వ మధ్యం దుకాణాల్లో జరిగిన వరుస దొంగతనాలను పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులతో పాటు.. ఒక ఇన్నోవా కారు, 90 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 12న స్థానిక ప్రభుత్వ మద్యం దుకాణంలో సుమారు 70 వేల రూపాయలు విలువచేసే మద్యంతో పాటు.. 17న మరో మద్యం దుకాణంలో 2 లక్షల 45 వేల రూపాయల విలువైన మద్యాన్ని చోరీ చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఈ మేరకు స్థానిక ఎక్సైజ్ సీఐ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందంతో గాలింపు చర్యలు చేపట్టినట్టు ముద్దనూరు డీఎస్పీ తెలిపారు. ఘటనలో మొత్తం ఐదుగురిని నిందితులుగా గుర్తించామని.. ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. వీలైనంత త్వరగా ఆ ఇద్దిరినీ పట్టుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు.
ఇవీ చదవండి: