కడప జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రొద్దుటూరులో ఇద్దరు క్రికెట్ బుకీలు, కడప సబ్ డివిజన్ పరిధిలో 8 మంది ప్రముఖులు, జమ్మలమడుగు పట్టణ పరిధిలో ఏడుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.20 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ ముగిసేంత వరకు క్రికెట్ బెట్టింగ్‌పై నిఘా ఉంటుందని జిల్లా పోలీసు అధికారి హెచ్చరించారు.
జిల్లాలో నాటు సారా తయారీదారులపై దాడి చేసిన పోలీసులప ఐదు వందల యాభై లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
ఇదీ చదవండి: వైభవంగా ప్రారంభమైన ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలు