ETV Bharat / state

తమ్ముడి హత్య కేసులో సోదరుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

author img

By

Published : Jul 29, 2020, 2:16 PM IST

కడప జిల్లా బద్వేలు మండలంలో జరిగిన సోదరుడి హత్య కేసులో నిందితుడైన అన్నను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు పెద్ద వెంకట సుబ్బయను రిమాండుకు పంపించినట్లు సీఐ రమేష్​బాబు తెలిపారు.

police arrested culprit of brother murder case

కడప జిల్లా బద్వేలు మండలం లక్ష్మీ పాలెంలో తమ్ముడిని హత్యచేసిన ఘటనలో అన్నను పోలీసులు అరెస్టు చేశారు. అన్నదమ్ములైన పెద్ద వెంకట సుబ్బయ్య, చిన్న వెంకటసుబ్బయ్య మధ్య ఏడాది కాలంగా పొలం వివాదం ఉంది. ఈనెల 24న పొలం వద్ద పనులు చేసుకుంటున్న తమ్ముడిని కాపు కాసి అన్న పెద్ద వెంకట సుబ్బయ్య రాళ్ళతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. కుటుంబీకులు క్షతగాత్రున్నిచెన్నైకి తరలించారు. చికిత్స పొందుతూ 26న మృతి చెందాడు. నిందితుడిని పట్టణ సీఐ రమేష్ బాబు అరెస్టు చేసి రిమాండ్​కి పంపించారు.

ఇదీ చదవండి:

భూమి కోసం అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. తమ్ముడి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.