ETV Bharat / state

కువైట్ హత్యల కేసు..ఇండియన్ ఎంబసీని ఆశ్రయించిన తెలుగువారు - Kuwait Murder Case victim wife on swathi

Kuwait Murder Case: కువైట్​లో జరిగిన హత్యల కేసులో నా భర్తను అన్యాయంగా ఇరికించారని వెంకటేశ్​ భార్య స్వాతి పేర్కొంది. బతుకు తెరువు కోసం ఆ దేశం వెళ్లామని.. ఎలాంటి తప్పు చేయలేదని.. నా భర్తను కువైట్ నుంచి ఇండియాకు రప్పించాలని కన్నీటిపర్యంతమయ్యారు. కువైట్ నుంచి స్వస్థలానికి తిరిగొచ్చిన స్వాతి.. ఈ మేరకు కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసింది.వెంకటేష్‌ వ్యవహారంపై ఇండియన్‌ ఎంబసీని అక్కడి తెలుగు వారు ఆశ్రయించగా కడప కలెక్టరేటుకు విషయం చేరింది.

కువైట్​లో హత్య కేసు
కువైట్​లో హత్య కేసు
author img

By

Published : Mar 11, 2022, 7:00 AM IST

Updated : Mar 11, 2022, 9:25 AM IST

ఎంబసీని ఆశ్రయించిన తెలుగువారు: కువైట్‌ హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేష్‌ విషయాన్ని అక్కడి తెలుగువారు ఇండియన్‌ ఎంబసీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ వ్యవహారం కడప కలెక్టరేట్‌కు చేరింది. బాధితుడి భార్య స్వాతి వివరాలివ్వాలని కలెక్టరేట్‌ నుంచి పోలీసులకు ఆదేశాలందాయి.

వెంకటేశ్
వెంకటేశ్ కుటుంబ సభ్యులు

ఇదీ చదవండి : Murder in Kuwait: కువైట్‌లో హత్య... కడపలో వైరల్‌..!

Kuwait Murder Case: కువైట్​లో జరిగిన మూడు హత్యలకు నా భర్త వెంకటేశ్​కు ఎలాంటి సంబంధం లేదని.. కువైట్ నుంచి స్వస్థలానికి వచ్చిన వెంకటేశ్​ భార్య స్వాతి అన్నారు. ఈ మేరకు కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం కువైట్ నుంచి ఇండియాకు వచ్చిన పిల్లొళ్ల స్వాతి.. దిన్నెపాడు కస్పాలోని ఇంటికి చేరారు. అనంతరం.. ఏ తప్పు చేయని నా భర్తను ఎలాగైనా కాపాడాలని లక్కిరెడ్డిపల్లె పోలీసులను ఆశ్రయించారు.

'కువైట్​లో సేఠ్, అతని భార్య, కూతుర్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వేరే ఇంట్లో డ్రైవర్​గా పని చేస్తున్న తన భర్త వెంకటేశ్​పై కేసు పెట్టి అన్యాయంగా ఇరికించారు. బతుకు తెరువు కోసం కువైట్​ వెళ్లాం. అక్కడ జరిగిన మూడు హత్యలతో నా భర్తకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరో చేసిన హత్యలకు తన భర్తను శిక్షించడం ఎంతవరకు న్యాయం' అని స్వాతి కన్నీటి పర్యంతమయ్యారు.

నా భర్తను కువైట్ నుంచి ఇండియాకు రప్పించాలని.. అతను ఎలాంటి నేరాలు చేయలేదని జిల్లా కలెక్టర్​ను కలిసి తమ గోడు విన్నవించుకుంటామని స్వాతి చెప్పారు. తన భర్తను ఎలాగైనా కాపాడాలని జిల్లా ఉన్నతాధికారులను ఆమె వేడుకున్నారు. కాగా.. కువైట్​లో జరిగిన హత్య ఘటనపై జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఆరా తీస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు.

ఈ విషయంపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌. శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

మచిలీపట్నంలో దారుణం.. ప్రియుడిని చెట్టుకు కట్టేసి యువతిపై అత్యాచారం

Last Updated : Mar 11, 2022, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.