కరోనా కష్ట సమయంలో అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు.. బాధ్యతలు విస్మరిస్తున్న తీరును ప్రజలకు తెలియచేయాలని పవన్ కల్యాణ్ అన్నారు. కడప జిల్లా నాయకులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయినవారి బాధలను తప్పకుండా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. జిల్లాలో పండ్ల తోటల రైతులు, పసుపు రైతులు ఎదుర్కొంటున్న బాధలను, జిల్లాలో యథేచ్చగా సాగుతున్న ఎర్రచందనం, ఇసుక అక్రమ రవాణాను జిల్లా నాయకులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు.
మీరు కేంద్రంతో ఎందుకు మాట్లాడటం లేదు: పవన్ - ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ కామెంట్స్
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి కరోనా మూలంగా చిక్కుకుపోయిన వారి బాధలు రాష్ట్రం నుంచి ఎన్నికైన లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు పట్టడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. కేంద్రంతో ఎందుకు మాట్లాడటం లేదని పవన్ ప్రశ్నించారు.