కట్టుకున్న ఇల్లు కాజేసి.. తోడబుట్టిన వాడే నడిరోడ్డుపై పడేశాడని ఓ అమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. కడప జిల్లా కమలాపురం మండలం కొండపల్లి గ్రామంలో సొంత అన్నే నమ్మించి మోసం చేశాడని ఆ వృద్ధురాలు తల్లడిల్లింది. సొంత డబ్బులతో నిర్మించిన తన ఇంటి నుంచే తనను వెల్లగొట్టాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎన్నిసార్లు విన్నవించుకున్న అధికారులు పట్టించుకోవడం లేదని, దీంతో స్పందనలో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఎస్పీకి చెప్పినప్పటికీ తనకు న్యాయం జరగలేదని... నమ్మినందుకు తన అన్నే తనను నడిరోడ్డుపైకి తీసుకొచ్చాడని కన్నీటి పర్యంతమైంది.
ఇవీ చూడండి...