ETV Bharat / state

పూర్వ విద్యార్థుల సాయం.. పోలీసులు, విలేకర్లకు భోజనం - పోలీసులకు మధ్యాహ్న భోజనం అందజేత

కరోనా నేపథ్యంలో అందరిలో సామాజిక బాధ్యత వెల్లివిరుస్తోంది. ఈ కష్టకాలంలో ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. కడప జిల్లా వేంపల్లెలోని ఓ పాఠశాల పూర్వ విద్యార్థులు పోలీసులు, విలేకరులు, పారిశుద్ధ్య కార్మికులకు మధ్యాహ్న భోజనం అందించారు.

old students at vempalle kadapa district distribute food for police, journalists
పోలీసులకు మధ్యాహ్న భోజనం అందజేత
author img

By

Published : Apr 5, 2020, 7:27 PM IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కడప జిల్లా వేంపల్లెలో అనేకమంది దాతలు తమ పరిధిలోని వారికి వివిధ రూపాల్లో సాయం చేస్తున్నారు. నగదు, కూరగాయలు, నిత్యావసరాలు, తాగునీరు, మజ్జిగ అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. కరోనా మహమ్మారికి భయపడకుండా తమ విధులు నిర్వహిస్తున్న పోలీసులు, విలేకరులకు తోచిన సాయం చేస్తున్నారు. గ్రామంలోని తల్లిశెట్టి సుబ్రహ్మణ్యం పాఠశాల పూర్వ విద్యార్థులు పోలీసులు, విలేకరులకు మధ్యాహ్న భోజనం అందించారు. ఈ కష్ట సమయంలో ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని వారు సూచించారు.

ఇవీ చదవండి.. పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్, మాస్కులు, కోడిగుడ్లు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.