ETV Bharat / state

కొవిడ్ సేవలకు గుర్తింపు.. నోడల్ అధికారి ప్రభాకర్ రెడ్డికి డాక్టరేట్

క్వారంటైన్ కేంద్రంలో కోవిడ్ బాధితులను నిరంతరం పర్యవేక్షణ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలు చేయడం... వలస కార్మికులను గుర్తించి వారిని ఆదుకున్నందుకు కడప జిల్లా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డికి డాక్టరేట్ అవార్డు వరించింది. నీతి అయోగ్ అనుబంధంగా ఉన్న జెనీవా దేశానికి చెందిన "నేషనల్ వర్చువల్ యూనివర్సిటీ ఫర్ పీస్ అండ్ ఎడ్యుకేషన్" సంస్థ ఆగస్టు 15న బెంగళూరులో అవార్డు అందజేయనుంది.

కోవిడ్ సేవలకు గుర్తింపుగా 'నోడల్ అధికారి ప్రభాకర్ రెడ్డికి డాక్టరేట్'

author img

By

Published : Aug 14, 2020, 4:43 PM IST

కోవిడ్ సేవలకు గుర్తింపుగా 'నోడల్ అధికారి ప్రభాకర్ రెడ్డికి డాక్టరేట్'

కరోనా బాధితులకు సేవ చేసేందుకు ఆయన ఎక్కడ వెనుకడగు వేయలేదు. మహమ్మారి బారిన పడిన వారికి ఆహారం, వసతులు, తదితర విషయాల్లో ఎటువంటి లోటు రానివ్వలేదు.ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారు. చివరికి కరోనా సోకినా తిరిగి విధుల్లో చేరి.. పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఆయన చేసిన ఇన్ని సేవలకు ఏకంగా జెనీవా దేశానికి చెందిన నీతి అయోగ్ అనుబంధ సంస్థ అయిన "నేషనల్ వర్చువల్ యూనివర్సిటీ ఫర్ పీస్ అండ్ ఎడ్యుకేషన్" సంస్థ జిల్లా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డికి డాక్టరేట్ ఇవ్వాలని నిర్ణయించింది.

నోడల్ అధికారిగా కరోనా బాధితులకు ప్రభాకర్ రెడ్డి సేవలు

కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ రోజుకు సగటున 700 పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ సమయంలో జిల్లా యంత్రాంగం జిల్లాలో దాదాపు 8 ప్రాంతాల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటికి నోడల్ అధికారులను నియమించింది. లాక్ డౌన్ సమయంలో విదేశాల నుంచి జిల్లాకు వచ్చేవారు, జిల్లాలో ఉన్న వలస కార్మికులను విదేశాలకు పంపడం వంటి కార్యక్రమాలు చేశారు. ఈ విధంగా కడప యోగివేమన విశ్వవిద్యాలయంలోని అతిథి గృహాలను క్వారంటైన్ కేంద్రాలుగా చేశారు. వాటికి జిల్లా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డిని నోడల్ అధికారిగా జిల్లా కలెక్టర్ నియమించారు.

మార్చి 24 నుంచి జులై ఆఖరు వరకు ప్రభాకర్ రెడ్డి నోడల్ అధికారిగా విధులు నిర్వహించారు. ఈ సమయంలోనే క్వారంటైన్ కేంద్రంలో ఉన్న 1850 మందికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా.. అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే రిమ్స్ లేదా తిరుపతి ఆసుపత్రికి పంపించే విధంగా చర్యలు చేపట్టారు. వీటితోపాటు జిల్లాలోని వలస కార్మికులను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గుర్తించడమే కాకుండా... వారికి కావాల్సిన కూరగాయలు, నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేశారు. దాదాపు 2 వేల మంది వలస కార్మికులకు 15 రోజులకు సరిపడా వస్తువులు అందజేసి... వారిని సురక్షితంగా వారి రాష్ట్రాలకు వెళ్లే విధంగా నోడల్ అధికారిగా పర్యవేక్షణ చేశారు.

ప్రభాకర్ రెడ్డి సేవలకు గుర్తింపు..

జిల్లాలో పలు చోట్ల క్వారంటైన్ కేంద్రాలు ఉన్నప్పటికీ వాటిలో ఉంటున్న బాధితులు ఫిర్యాదు చేస్తుండేవారు. కానీ యోగి వేమన విశ్వవిద్యాలయంలో బాధితుల నుంచి జిల్లా అధికారులకు ఎలాంటి ఫిర్యాదులు వెళ్లకుండా చూసుకోవడంతో పాటు... వారికి కావాల్సిన వసతులు, భోజన సౌకర్యాలు, వైద్య సదుపాయాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం చేశారు. పీవో ప్రభాకర్ రెడ్డి సేవలను జిల్లా కలెక్టర్ గుర్తించడమే కాకుండా... కలెక్టర్ అధికారిక సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయడం.. వివిధ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఈయన సేవలపై ఆరా తీసిన జెనీవా దేశానికి చెందిన నీతి అయోగ్ అనుబంధ సంస్థ అయిన "నేషనల్ వర్చువల్ యూనివర్సిటీ ఫర్ పీస్ అండ్ ఎడ్యుకేషన్" సంస్థ ప్రభాకర్ రెడ్డికి డాక్టరేట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈయన సేవలను 15 రోజుల పాటు ఆ సంస్థ వివిధ కోణాల్లో సర్వే చేసి నివేదికలు తెప్పించుకుని చివరికి నిర్ణయం తీసుకుంది. ప్రభాకర్ రెడ్డికి డాక్టరేట్ ఇస్తున్నట్లు ప్రకటించిన ఆ సంస్థ ఆహ్వాన పత్రాన్ని ఆయనకు పంపింది. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం రోజు బెంగళూరులోని భారతీయ విద్యా భవన్​లో ప్రభాకర్ రెడ్డికి డాక్టరేట్ బహూకరించనున్నారు. శనివారం ప్రభాకర్ రెడ్డి డాక్టరేట్ తీసుకోవడానికి బెంగళూరు వెళ్లనున్నారు. ఈ అవార్డు రావడం తనకు చాలా సంతోషంగా ఉందని... తాను చేసిన సేవలకు గుర్తింపు వచ్చిందనే నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు. ఇలాంటి ప్రోత్సాహక అవార్డులు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయని అన్నారు.

కొవిడ్ నుంచి కోలుకుని తిరిగి విధులకు..

కొవిడ్ బాధితులకు సేవ చేస్తున్న సమయంలోనే పీవో ప్రభాకర్ రెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు. జులై 30వ తేదీ ఆయనకు పాజిటివ్ రావడంతో రెండు వారాల పాటు హోం ఐసోలేషన్ లో ఉండి గురువారం మళ్లీ విధులకు హాజరయ్యారు.

ఇవీ చదవండి

కడపలో వైఎస్ఆర్ లలిత కళల వర్శిటీ... అక్టోబర్ నుంచి తరగతులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.