ప్రతి విద్యార్థికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రత్యేక కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు... నెల్లూరు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయ్ కృష్ణారెడ్డి తెలిపారు. కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో... విక్రమ సింహపురి యూనివర్సిటీ పీజీ సెట్ 2020కి సంబంధించి నోటిఫికేషన్ను జారీ చేశామని, ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఒకవైపు పీజీ కోర్సులు చేసుకుంటూ మరోవైపు డిప్లొమా కోర్సు చేసుకునేందుకు వీలుందని చెప్పారు.
యూనివర్సిటీలో కొత్తగా పీజీ డిప్లొమా జర్నలిజం, హిందీ అనువాద కోర్సు, యోగా డిప్లొమా, సిరికల్చర్, ఆక్వా కల్చర్ పీజీ డిప్లొమా, టూరిజం డెవలప్మెంట్, ఫుడ్ టెక్నాలజీ వంటి కోర్సులు ఉన్నాయని తెలిపారు. కరోనా కారణంగా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే పీజీ సెట్ పరీక్షల తేదీని ఇంకా ఖరారు చేయలేదని వివరించారు. ఆర్థిక భారం పడకుండా సీఎం జగన్... జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా ఆర్థిక సహకారం అందిస్తున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థి ఉపాధి వైపు అడుగులు వేయాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: