ETV Bharat / state

Nara Lokesh Open Challenge : రాయలసీమకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా..? : వైఎస్సార్సీపీ నేతలకు లోకేశ్ సవాల్ - Nara Lokesh Open Challenge

Nara Lokesh Open Challenge : రాయలసీమని అభివృద్ధి చేసింది మేమే.. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ రాయలసీమలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం అని లోకేశ్ హామీ ఇచ్చారు. రాయలసీమలో యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా బద్వేలు విడిది కేంద్రం వద్ద ఆయన మాట్లాడారు. ఈ నాలుగేళ్లలో వైఎస్సార్సీపీ రాయలసీమకు చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు.

రాయలసీమకు ఎవరేం చేశారో సిద్ధమా
రాయలసీమకు ఎవరేం చేశారో సిద్ధమా
author img

By

Published : Jun 14, 2023, 7:16 AM IST

Nara Lokesh Open Challenge : రాయలసీమ ప్రాంతానికి ఈ నాలుగేళ్లలో వైఎస్సార్​సీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 8 మంది పార్లమెంటు సభ్యులు ఏం అభివృద్ధి చేశారో.. ఐదేళ్ల టీడీపీ హయాంలో తాము ఎలాంటి అభివృద్ధి చేశామో చర్చించడానికి సిద్ధమని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు. మిషన్ రాయలసీమ పేరుతో రాయలసీమ వైఎస్సార్సీపీ నాయకులకు సవాల్ విసిరిన నారా లోకేశ్.. ఎక్కడికి రమ్మన్నా తాను ఒక్కడినే వస్తానని స్పష్టం చేశారు. బద్వేలు విడిది కేంద్రం వద్ద మీడియా ప్రతినిధులతో చిట్ చాట్​తో పాటు.. బయట మిషన్ రాయలసీమ ఛాలెంజ్ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల సందర్భంగా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర రాయలసీమలో ముగిసి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది.

నెల్లూరు జిల్లాలోకి ప్రవేశం.. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర రాయలసీమలో ముగిసింది. ఉమ్మడి కడప జిల్లాలో 16 రోజులపాటు సాగిన లోకేశ్ పాదయాత్ర బద్వేలు నియోజకవర్గంలోని పీపీ కుంట చెక్ పోస్ట్ దాటిన తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం లోకి ప్రవేశించింది. అంతకుముందు పీపీ కుంట విడిది కేంద్రంలో మీడియా ప్రతినిధులతో లోకేశ్ చిట్ చాట్ నిర్వహించారు. విడిది కేంద్రం బయట ఏర్పాటు చేసిన మిషన్ రాయలసీమ ఛాలెంజ్ ఫ్లెక్సీలు వద్ద ఫొటోలు దిగి ఆ ఫ్లెక్సీలో పేర్కొన్న అంశాలను అక్కడికి వచ్చిన ప్రజలకు లోకేశ్ చూపించారు. రాయలసీమలో 49 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలకు నారా లోకేశ్ ఛాలెంజ్ విసిరారు. 57 మంది రండి.. నేను ఒక్కడినే వస్తా.. ఎక్కడికి రావాలో మీరే నిర్ణయించండని లోకేశ్ సవాల్ చేశారు. సీమకు ఎవరి హయాంలో మేలు జరిగిందో చర్చకు మేము సిద్ధం అంటూ సవాల్ చేసిన లోకేశ్.. నాలుగేళ్లలో జగన్, వైఎస్సార్ పార్టీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు సీమకు చేసింది ఏమీ లేదని విమర్శించారు.

సెల్ఫీ ఛాలెంజ్.. ఒక్క ప్రాజెక్టు పూర్తి చెయ్యలేదు, ఒక్క పరిశ్రమ తీసుకు రాలేదన్నారు. బద్వేలు క్యాంప్ సైట్ బయట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు సెల్ఫీలు దిగి వైఎస్సార్సీపీ కి ఛాలెంజ్ చేసిన లోకేశ్.. క్యాంప్ సైట్ ముందు టీడీపీ హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులు, సీమ కు వచ్చిన కంపెనీల లిస్ట్ ప్రదర్శిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అక్కడికి వచ్చిన పార్టీ నేతలకు ప్రజలకు చూపించారు. మేము చేసింది ఎంటో చూపించాను. మీరు చేసింది ఎంటో చెప్పే దమ్ము ఉందా అంటూ జగన్ కి సవాల్ విసిరిన లోకేశ్.. మిషన్ రాయలసీమ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన హామీల తో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు సెల్ఫీ తీసుకున్నారు. గతంలో సీమ ని అభివృద్ధి చేసింది మేమే... మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ రాయలసీమ లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం అని లోకేశ్ హామీ ఇచ్చారు.

రాయలసీమలో ముగిసిన పాదయాత్ర.. రాయలసీమలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగిసింది. బద్వేలు నియోజక వర్గంలోని పీపీ కుంట విడిది కేంద్రం వద్ద లోకేశ్ కు వీడ్కోలు పలికేందుకు రాయలసీమకు చెందిన టీడీపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. రాయలసీమ నేలకు నమస్కరించి భావోద్వేగానికి లోనైన నారా లోకేశ్.. సీమ లో పాదయాత్రకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు, సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు పాదయాత్ర జిల్లాలో ప్రవేశించగానే ఘన స్వాగతం పలికారు. లోకేశ్​కి స్వాగతం పలికిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, బోల్లినేని వెంకటరామారావు, కంభం విజయరామిరెడ్డి తదితర ముఖ్య నేతలు లోకేశ్ కు ఘన స్వాగతం పలికారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.