ETV Bharat / state

15 నుంచి నారపుర వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

కడప జిల్లా జమ్మలమడుగులో శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి అంకురార్పణతో ప్రారంభమై 25వ తేదీన పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయి.

author img

By

Published : May 13, 2019, 4:10 PM IST

నారపుర వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న ఆలయం

కడప జిల్లా జమ్మలమడుగులో పెన్నానది ఒడ్డున కొలువైన శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. బుధవారం నుంచి 25 వరకు వేడుకలు జరిపించేందుకు తితిదే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15న అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 16న ధ్వజారోహణము, 20న గరుడ వాహనం, 21న కల్యాణోత్సవము జరుగుతాయి. 25వ తేదీన జరిగే పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. స్థలపురాణం ప్రకారం నారపురయ్య అనే భక్తుడి పేరు మీదుగా ఆలయానికి నారపుర వెంకటేశ్వరస్వామి ఆలయం అని పేరు వచ్చింది.

Intro:AP_GNT_41_12_BAVANARAYANA_SWAMI_SIMHA_VAHANA_SEVA_AV_C7. FROM.....NARASIMHARAO, CONTRIBUTOR ,BAPATLA ,GUNTUR, DIST కిట్ నెంబర్ 676 శ్రీమత్ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావన్నారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మూడు రోజులుగా వైభవంగా జరుగుతున్నాయి. నేడు స్వామివారికి సింహవాహన సేవ నిర్వహించారు, గదాధరుడైన స్వామి వారిని సింహవాహనంపై బాపట్ల పట్టణంలోని పురవీధులలో ఊరేగించారు ,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సింహ వాహనంపై ఆసీనులైన స్వామిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

Body:బాపట్ల

Conclusion:గుంటూరు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.