విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ఆరోగ్యాన్ని పరిశీలించడం కోసం కోసం కడప జిల్లా మైదుకూరులో 300 పడకలతో మూడు చోట్ల నిర్బంధ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. శుక్రవారం మైదుకూరు మండలం వనిపెంట బాలికల గురుకుల విద్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పరిశీలించారు. బెడ్డు, తలగడ తో పాటు పళ్లెం, గ్లాసు సిద్ధం చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా వివరించారు. నిర్బంధ కేంద్రంలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు వెల్లడైతే అలాంటి వారిని కడపకు తరలిస్తామని అధికారులు వివరించారు.
ఇదీ చదవండి: