పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కడపలో ముస్లింలు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఆగాడి వీధి నుంచి ప్రారంభమైన ర్యాలీ ఏడు రోడ్ల కూడలి వరకు కొనసాగింది. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ చట్టాలు రద్దు చేయకుంటే ముస్లింల భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ వైఖరితో దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లింలలో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం ఈ చట్టాలను రద్దు చేయకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి...