కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ మార్కెట్ ప్రక్షాళనకు మున్సిపల్ అధికారులు సన్నద్ధమయ్యారు. అక్రమంగా మార్కెట్ ప్రధాన రహదారిపై నిర్మించిన షాపుల వివరాలను మున్సిపల్ అధికారులు నమోదు చేశారు. మార్కెట్‌లో కేటాయించిన స్థలాలు, షాపులకు మించి రోడ్డుపైకి వచ్చిన అక్రమ దుకాణాలను తొలగించాలని దుకాణ యజమానులకు కమీషనర్ రాధారెడ్డి హెచ్చరించారు. కోనేటి కాల్వ వీధి మున్సిపల్ షాపింగ్ రూముల వెనుక భాగంగా అనధికారికంగా వెలసిన రూములు, ఇతరులకు అద్దె కిచ్చిన రూములను తొలగించాలని...చట్టవిరుద్దంగా నడుస్తున్న షాపుల సమస్యలను పరిష్కరించే దిశగా ఫైళ్లు రెడీ చేయాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశించారు. రెండు మూడు రోజుల్లో అక్రమణలను తొలగిస్తామని రాధారెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: ఓ తండ్రి నిర్వాకం...అమ్మకానికి ఆడ'పసికందు'