ఎల్ఐసీని ప్రభుత్వ రంగంలోనే ఉంచేందుకు పెద్ద ఎత్తున ప్రజల సహకారంతో ఉద్యమాలు చేస్తామని కడప ఎల్ఐసీ డివిజన్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు, సంతకాల సేకరణతో పాటు మరోసారి.. లోక్ సభ ఎంపీలు అందరినీ కలిసి వినతులను అందజేస్తామని అన్నారు. యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశంలో 40 కోట్ల మందికి బీమా రక్షణ ఉందని పేర్కొన్నారు. ప్రజల ఆస్తులు పెరిగితే బీమా రంగం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. జీవిత బీమాకు స్వయం నిర్ణయం స్వేచ్ఛ ఇవ్వాలని.. ఈ సమస్యను మరింత బలోపేతం చేయాలని బీమా సంస్థలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అనుక్షణం ఉత్కంఠ