మూడు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన రాయలసీమను అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. తన కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ప్రజల విశ్వాసానికి వ్యతిరేకంగా పని చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. సమస్య పరిష్కారానికి జేఏసీ నాయకులతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు సహనం కోల్పోతున్నారని. జీఎన్ రావు కమిటీపై స్థాయిని మరిచి మాట్లాడటం తగదన్నారు.
ఇవీ చూడండి: