టెంపు బోల్తా పడిన సంఘటనలో 14 మందికి తీవ్రగాయాలు కాగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కడప జిల్లా రాజంపేట మండలం రాయచోటి మార్గంలోని రోళ్లమడుగు ప్రాంతంలో జరిగింది. పెనగలూరు మండలం సింగనమల, కంబాలకుంట గ్రామాలకు చెందిన కూలీలు సుండుపల్లెలో మామిడికాయలను కోయడానికి టెంపోలో బయలుదేరారు. రోళ్లమడుగు ప్రాంతంలో టెంపో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో 14 మంది గాయపడ్డారు. అదే సమయంలో ఆ మార్గంలో వెళుతున్న మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి వారందరినీ దగ్గరుండి తన వాహనంలో, 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషమంగా ఉన్న వారిని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి. కరోనా భయంతో కంటి ఆస్పత్రుల్లో కానరాని రోగులు