రాష్ట్రంలో దళితులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులపై సీఎం జగన్ స్పందించకపోవడం బాధాకరమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై జగన్ మౌనం వీడాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. కడప ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
వర్గీకరణ విషయం రాష్ట్రాలకు అప్పగించామని నాలుగు నెలల క్రితం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన లేదన్నారు. ధర్మవరంలో స్నేహలత విషయంలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని.. సంబంధిత పోలీసులను తక్షమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను నిరసిస్తూ.. త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మరోసారి జనవరి 9 లేదా ఫిబ్రవరి మొదటి వారంలో సుప్రీంకోర్టులో జరగనున్న విచారణ సమయంలోనైనా జగన్ స్పందించాలని కోరారు.
ఇదీ చదవండి: