కడప శివారులోని కనుమలోపల్లి వద్ద సరకులతో వెళ్తున్న లారీ అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో రూ.9 లక్షల మేర నష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది వెళ్లి మంటలను అదుపు చేశారు. గుజరాత్ నుంచి చెన్నైకి బట్టలు పౌడర్ లోడ్ వేసుకొని వెళ్తున్న లారీ కనుమలోపల్లి వద్దకు రాగానే క్యాబిన్లో తీగలు ఒకదానికొకటి అంటుకొని మంటలు వచ్చాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. డ్రైవర్ లారీని అక్కడే అపి కిందకు దిగాడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.
ఇదీ చదవండి 23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం