కడప జిల్లా మైదుకూరు మండలం జీవీసత్రం వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీతోపాటు కాపలాగా వస్తున్న కారును సీజ్ చేసినట్లు సీఐ బీవీ చలపతి తెలిపారు. నెల్లూరు జిల్లా సంగం నుంచి కర్నూలు జిల్లా నంద్యాలకు ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరోతో పాటు పోలీసులు కలిసి తనిఖీలు నిర్వహించి లారీని సీజ్ చేసినట్లు చెప్పారు. లారీకి ముందు పైలెట్‌గా వస్తున్న కారును కూడా సీజ్ చేసినట్లు వివరించారు.
ఖాజీపేట మండలం మూలవారిపల్లెకు చెందిన మైసూరారెడ్డి, దువ్వూరులోని కొత్తకొట్టాలకు చెందిన పాణ్యం హుస్సేన్‌వలి, వీరపునాయనపల్లె మండలం ఓబులరెడ్డిపల్లెకు చెందిన వెంకటేశ్వర ప్రసాద్ మైదుకూరు పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన షేక్ ఖాదర్‌బాషాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వెలుగులోకి 9వ శతాబ్దం నాటి తెలుగు శిలాశాసనం